Thursday, 13 October 2016

some side effcts for heaths in air conditioner --- ఏసీ వల్ల ఆరోగ్యానికి కలిగే తీవ్రమైన నష్టాలు మీకు తెలుసా !

ప్రస్తుత పరిస్తితుల్లో చాలా మంది యువతి,యువకులే కాకుండా పెద్దవారు కూడా కాసేపు ఏసీ లో ఉందాం అనేంతగా మార్పు వచ్చింది అంతేకాదు మరికొంతమంది అయితే అసలు ఏసీ లేకుండా ఉండలేని వారు కూడా ఉన్నారు.అయితే ఇప్పుడు ఈ ఏసీ వల్ల కూడా చాలా ఆరోగ్యమైన సమస్యలు తలెత్తుతున్నాయి.అవేంటో ఇప్పుడుచూద్దాం……

వేడిని తట్టుకోలేకపోవడం:
చాలా మంది నిత్యం ఏసీ లో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు.అలాంటి వారు బయట వేడిని ఎక్కువ సమయం తట్టుకోలేరు కాబట్టి అలాంటి వారికి వడదెబ్బ ఎక్కువగా తగుల్తుంది.
శ్వాస సమస్యలు:
నిత్యం కారు డోర్స్ మూసి ఉన్న ఏసిఎలో గడపడం వల్ల అక్కడి సూక్ష్మజీవులు ఏటూ వెళ్లలేక అక్కడక్కడే తిరుగుతూ ఒకరినుంది మరొకరికి వ్యాపిస్తూ ఉంటాయి దీనివల్ల శ్వాస సంభంధమైన వ్యాధులు తెలెత్తుతాయి. కాబట్టి అలాంటి వారు ప్రతి రెండు గంటలకు ఒకసారి బయటకు వచ్చి మాములు వాతావరణం లో పదినిముషాలు గడపడం మంచిది.
తీవ్రమైన అలసట:
చాలామంది ఎక్కువ సేపు ఏసీ లో పనిచేయడం వలన ఏసీలో ఉండే చల్లడనం ఎక్కువగా మారి పని ముగిసే సమయానికి తీవ్రమైన తలనెప్పి,అలసటగా ఉండడం జరుగుతుంది.ఎక్కువసేపు ఏసీలో ఉంటే చలి కారణం గా కండరాలకు తగిననత రక్తప్రసరన జరగక అలసట వస్తుంది.
దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువ:
రక్తపోటు,ఆర్దరైటిస్,న్యూరైటిస్ వంటి జబ్బులు ఉన్న వారికి సమస్య తీవ్రతరం అవుతుంది.
పొడి చర్మం:
ఎక్కువ సమయం ఏసీలో గడిపే వారికి దానిలో తేమ వలన చర్మం పొడి బారుతుంది.కాబ్ట్టి అలాంటి లక్షణాలు ఉన్నవారు మాయిశ్చరైజర్ వాడితే ఎలాంటి సమస్య తలెత్తడు.

No comments:

Post a Comment