చేపలు,ఇది తెలియని వారుండరు భూమ్మీద. ఎందుకంటే ప్రతి రోజు 60 % దీనినే ఫుడ్ గా తీసుకుంటారు.అంతే కాకుండా ఒక్కో చోట ఒక్కో ఫిష్ ఫేమస్.చేపలను చాలా జబ్బులకు నివారణగా డాక్టర్లు దీనిని తినమన్నారని కూడా మనం విని వుంటాం. ఆరోగ్య నిపుణులు ఎన్నో రోగాలకు నివారణగా దీనిని ఆహారంగా తీసుకోమని చెప్తారు. ఇంతకీ దీని వల్ల కలిగే అద్భుతమైన లాభాలు ఒక సారి చూద్దాం.
1. చేపల వల్ల ఓమెగా -3 ఫాటీ ఆసిడ్ లు మన శరీరానికి బాగా అందుతాయి. దీని వల్ల రక్తం త్వరగా గడ్డకట్టకుండా చేసి, రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. తద్వారా నొప్పులను,వాపులను తగ్గిస్తుంది.
2.చేప నూనె జుట్టు ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు చర్మాన్ని కాంతివంతంగా చేస్తూ నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది.
3.గోళ్ళను మృదువుగా మరియు బలంగా మారుస్తుంది.
4. చేప నూనె వున్న ఎసెన్షియల్ పుడ్ ని తీసుకోవటం వల్ల మొటిమలు తగ్గుతాయి. అంతే కాకుండా చర్మపు తేమస్థాయిని పెంచి, మృదుత్వాన్ని పెంచుతుంది.
5.కొన్ని పరిశోధనలలో తేలిందేమిటంటే ఓమేగా – 3 ఫాటీ ఆసిడ్ లు శరీర బరువును తగ్గిస్తాయంట. ఇది బరువు తగ్గాలనుకోవారికి మంచి న్యూస్. సో ఇక పై బరువు తగ్గడానికి చేపలు తింటే చాలన్న మాట.

No comments:
Post a Comment