నా వయసు 32. పెళ్లయ్యి ఎనిమిదేళ్లు అవుతోంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మావారు సెక్స్‌లో చాలా హుషారుగా ఉంటారు. నాకూ ఇష్టమే. కాకపోతే ఆయన కొత్త కొత్త భంగిమలు కావాలంటారు. ఇంగ్లిష్ ముద్దులు పెట్టమని అడుగుతారు. నా ఛాతిని ప్రెస్ చేయాలని ఆశపడతారు. పైగా నేనే పైకి వచ్చి చేయాలంటారు. నాకవేమీ ఇష్టం ఉండదు. నావల్ల కాదు అని చెబితే ఆయన నిరుత్సాహపడుతుంటారు. నేనేం చేయను? ఆయన కోరినవి చేయడం వల్ల ఏ ఇబ్బందులూ ఉండవా? నేను తనని ఎలా తృప్తి పర్చగలను?
కొందరు ఎప్పుడూ రొటీన్‌గా కాకుండా, కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టు అవతలివాళ్లు కూడా ఉండాలని కోరుకుంటారు. అలా కోరుకోవడంలో తప్పు లేదు. కాకపోతే బలవంత పెట్టకూడదు. మెల్లగా చెప్పి ఒప్పించాలి. భార్యాభర్తలన్నాక ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరికి కావలసినట్టు ఇంకొకరు నడచుకోవాలి. కొన్నిసార్లు మనకి నచ్చకపోయినా అవతలి వారి కోసం కొన్ని అలవర్చుకోవడంలో ఆనందం ఉంటుంది. మీవారు కోరకూడని వేమీ కోరలేదు. అవి పెద్ద ఇబ్బందికర మైనవీ కావు. వాటివల్ల ఏ సమస్యలూ కూడా రావు. కాబట్టి మీరు తనని అర్థం చేసుకోండి. తన కోరికలు తీర్చడానికి ప్రయత్నించండి. తద్వారా మీరు ఆయన్ని తృప్తిపర్చగలుగుతారు. భార్య దగ్గర కాకపోతే భర్త తన కోరికలను ఎవరి దగ్గర చెప్పగలడు! కాబట్టి మీరు సిగ్గు, బిడియం వదిలి మీవారిని అనుసరిస్తే ఇద్దరూ సంతోషంగా ఉంటారు.

No comments:
Post a Comment