ఇంపెటిగో…ఇది చిన్న పిల్లలో కలిగే అతి చిన్న గా కనపడే అతి పెద్ద సమస్య.ఇది ఒక అంటు వ్యాధి. ఒకరికి వస్తే ఇంట్లోని మిగతా వారికి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ చర్మ వ్యాధి స్ట్రెప్టోకోకస్ మరియు స్టాపైలాకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మాములుగా అయితే ఈ వ్యాధి ఒక నెల రోజులలో పోతుంది. అంతే కాకుండా ఈ వ్యాధిని ఇంట్లోనే వుండి ఇంట్లో వుండే వాటితోనే తగ్గించుకోవచ్చు.
ఇంతకీ పిల్లలకు ఎక్కువగా వచ్చే ఇంపెటిగోను తగ్గించే హోమ్ రెడిమిస్ ను ఒక సారి చూద్దాం. ద్రాక్ష పండు విత్తనాల సారం ,దీనిలో వుండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇంపెటిగోను చాలా శక్తివంతంగా నివారిస్తుంది.దీనిని నేరుగా అప్లై చేస్తే సరిపోతుంది.దీని వల్ల దురదలు కూడా తగ్గుతాయి. వేడి కూడా ఈ వ్యాధిని దూరం చేస్తుందట. అలాగే కొల్లాయిడల్ సిల్వర్ మరియు పసుపు కూడా ఇంపెటిగోను శక్తివంతంగా దూరం చేస్తుంది. మంచి ఫలితాల కోసం రోజులో రెండు ,మూడూ సార్లు రాయాలి.

No comments:
Post a Comment