Tuesday, 27 September 2016

in young stage to skin spoil what to do -- యుక్త వయస్సులో వచ్చే చర్మ వ్యాధులను దూరం చేసుకోవడం ఎలా ?

 యుక్త వయస్సులో వున్న వారు ఎదుర్కొనే సమస్యలలో అతి పెద్ద సమస్య చర్మ వ్యాధులు. అవును ..ఇది చాలా సర్వేలలో కూడా నిరూపితమైనది.ఈ వయస్సు తెలిసి తెలియనది అవ్వటం వల్ల మనకు వచ్చిన చర్మ వ్యాధులను ఎలా దూరం చేసుకోవాలో వారికి తెలియదు.అందులో ఆడవారికైతే మరిను. ఇక పోతే యుక్త వయస్సులో వున్న చర్మ వ్యాధులను తగ్గించుకోవడానికి పడుకునే ముందు తేమ వున్న క్రీమ్ ను ముఖానికి రాసుకోవాలి. అలాగే తీసుకునే ఆహార పదార్దాల విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. వేపుళ్ళు, ఎక్కువ ఆయిల్ కంటెంట్ వున్న ఆహార పదార్దాలను దూరం పెట్టాలి.

ఈ వయస్సులో అతి పెద్ద చర్మ సమస్య మొటిమలు. మనలోని హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా మొటిమలు వస్తాయి. వీటికి డాక్టరు పర్యవేక్షణలో మందులు వాడాలి.లేదా వాడకపోవడమే ఉత్తమం. ఏది పడితే అది వాడితే మచ్చలు ఏర్పడతాయి.ఎక్కువగా వ్యాయమాలు చేయాలి.అలాగే రోజు వీలైనంతగా ఎక్కువ నీరును తాగాలి. వీటిని తూచ తప్పకుండా వాడితే యుక్త వయస్సులో వచ్చే చర్మ వ్యాధులను దూరం పెట్టవచ్చు.

No comments:

Post a Comment