Sunday, 25 September 2016

amazing banifits of eating tulasi -- తులసీ ఆకుల రోజు తినడం వల్ల కలిగే అమేజింగ్ లాభాలు….

తులసీ, ఈ పదం తెలుగు నాట తెలియని వారుండరు. మన పెద్దలైతే దీని పూజించడమే కాదు రోజుకు రెండు మూడు ఆకులను తినమంటరు. అంతటి విశిష్టిత వున్న మొక్క లాభాల గురించి తెలుసుకోవడం మన బాధ్యత. ఎందుకంటే మనం కూడా మన పిల్లలకి చెప్పాలి కదా. అదంతా పక్కన పెడితే తులసీ ఆకుల వల్ల చాలా లాభాలు వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1. దీనిని పురాతన కాలం నుండి జలుబు, ప్లూ,జ్వరం ను తగ్గించే మందులలో వాడుతున్నారు.
2. చర్మ ఆరోగ్యం,కిడ్నీ పని తీరును మెరుగుపర్చడం, కిడ్నీ లో రాళ్ళను కరిగిస్తుంది.
3. దీనిని ఆకులు రోజు తినడం వల్ల శరీరంలో కార్టిస్టాల్ స్థాయిలను తగ్గించి ఒత్తిడిని తగ్గిస్తుందట.
4. తులసీ లోని యాంటీ – స్ట్రెస్ కారకాలు మన నరాలను విశ్రాంత పరచి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది.
5.టీలో తులసి ఆకులను వేసుకోని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు వుంటాయి.
వీలైనంత వరకు రోజుకి 5 – 10 ఆకులు తినాల్సిందిగా డాక్టర్లు సూచిస్తున్నారు. సో మీరు కూడా దీనిని ట్రై చేయండి.

No comments:

Post a Comment