Monday, 6 February 2017

so many uses of kaju you know -- జీడి పప్పు వల్ల కలిగే అద్భుతమైన లాభాలేంటో తెలుసా….

జీడి పప్పు , ఈ పేరు తెలియని వారు వుండరు . ఎందుకంటే చాల వంటకాలలో, స్వీట్లలో ,పిండి పదార్దాలలో అవసరం వున్నా లేకున్నా తెగా వాడేస్తుంటారు. ఎందుకంటే ఇవి అంత టేస్టీగా వుంటాయి ఇక టేస్ట్ ను పక్కనబెడితే దీని వల్ల చాలా లాభాలు వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1. పచ్చిగానూ, వేయించి తినే జీడిపప్పులో అనకార్డిక్ ఆమ్లాలు ఎక్కువగా వుంటాయి. ఇది దంత సమస్యలను నివారిస్తాయి
2. జీడిపప్పు ఆయిల్‌ను యాంటీ ఫంగల్ సమస్యలకు విరుగుడుగా, కాలిపగుళ్లకు మందు గానూ ఉపయోంచివచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
3.జీడిపప్పులో చక్కెర, పీచుపదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, కాల్షియమ్, ఐరన్, మెగ్నీషియమ్, పొటాషియం, విటమిన్ బి1, బీ2, బి3, బి5, బి6, సి, జింకు వంటి ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
4. మెగ్నీషియమ్, కాల్షీయం అధికంగా వుండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.
5. బీపి వున్న వారు దీనిని తినడం వల్ల ఎటువంటి సమస్య వుండదు.
6. జీడిపప్పులో వుండే యాంటి ఆక్సిడెంట్లు, సెలీనియమ్, మరియు విటమిన్ ఇ కేన్సర్ సమస్యలను దూరం చేస్తుంది.

No comments:

Post a Comment