Wednesday, 8 February 2017

super redmis in decrease in pain of chicen gunia -- ఇంట్లోనే చికెన్ గున్యా నొప్పిని తగ్గించుకోవచ్చు అదెలాగో తెలుసా?

చికెన్ గన్యా … ఈ వ్యాధిన పడిన వారు కీళ్ళ నొప్పితో పడే భాద అంతా ఇంతా కాదు. ఈ వ్యాధిని ఆయుర్వేదం లో సంధి జ్వర అని పిలుస్తారు. దీనికి మిగిలిన వ్యాధుల్లాగా యాంటీ వైరల్ మందుల్లేవు. అన్నింటి కన్న మంచి పని దీనిని నివారించడమే. ఇక పోతే దీనిని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో మంచి ఔషధాలు వున్నాయి. వీటిని ఇంటి దగ్గర వుండి మనమే తయారు చేసుకోవచ్చు. ఇంతకీ అవేంటో ఒక సారి చూద్దాం.

1. వెల్లుల్లి పేస్ట్ లేదా లవంగాల నూనె ను పేపర్ సహయంతో నొప్పి ఫీల్ అవుతున్న చోట రాయాలి.
2. అశ్వగంధను నమలాలి.
3. ఎప్సం సాల్ట్ ను గోరు వెచ్చని నీళ్ళలో వేసుకోని, దానిలో కొన్ని వేపాకులు వేసుకోని స్నానం చేయాలి.
3. ద్రాక్షపండను ఆవు పాలలో వేసుకోని తాగడం వల్ల కూడా ఈ వ్యాధి వల్ల వచ్చే కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.
4 క్యారెట్ , ఐరన్, కాల్షియం అధికంగా వున్న పదార్దాలు తీసుకోవాలి. దీని వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.
5. రోజు కొన్ని తులసి ఆకులు తినడం వల్ల జ్వరం తగ్గి, రోగ నిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది.
6. ఈ వ్యాధి పడిన వారు కొబ్బరి నీళ్ళను ఎక్కువగా తాగాలి.

No comments:

Post a Comment