Friday, 3 February 2017

some tips are useing to decrease in drepression ---మనోవ్యాధి తగ్గించుకోవడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలు …..

మనోవ్యాధి (డిప్రెషన్ ) ,ఇది రావడానికి చాలా కారణాలు వుంటాయి. కొన్ని సర్వేల ప్రకారం ప్రతి మనిషి తన జీవితంలో ఒకసారైనా ఈ వ్యాధిని పాలవుతాడని తెలిసింది. చూడడానికి చిన్నగా కనబడిన దీని వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వ్యాధిన బడ్డవారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా వుంటుంది. అకలి వేయదు. ప్రతి చిన్న విషయాన్ని చాలా పెద్దగా చూస్తారు. ఇలాంటి వారు ఈ వ్యాధి నుంచి బయటపడడానికి మా దగ్గర కొన్ని చిట్కాలు వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1. ఈ వ్యాధి బాధపడే వారు ఒంటరిగా అస్సలు వుండకూడదు. వీలైనంతవరకూ మన తోడు గా ఎవరోకరు వుండేలా చూసుకోవాలి.
2. ఒత్తిడిని తగ్గించడానికి గొప్ప సొల్యూషన్ వ్యాయమం. సో ప్రతి రోజు అరగంట నుంచి గంట వరకు వ్యాయమం చేయాలి.
3.ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ అంతటా మీరే నిర్ణయం తీసుకోని దానిపై మీకు దగ్గరైన వాళ్ళ అభిప్రాయాన్ని అడిగి ఆ పని చేయాలి. అంతే కాకుండా ప్రతి సమస్యపై తీవ్రంగా ఆలోచించకండి.
4.వీలైనంత వరకు మెద్దు, మనస్సును హాయిగా వుంచుకోవాలి.
5. పోగత్రాగడం, మద్యం వంటి పనులకు దూరంగా వుండాలి.
6. యాలకులతో తయారు చేసిన టీని తాగడం అలవాటు చేసుకోవాలి.

No comments:

Post a Comment