Sunday, 25 September 2016

no sivalingam in one-of the temple -- ప్రపంచంలో శివలింగం కనిపించని ఏకైక శివాలయం ఇదొక్కటే

శివలింగం లేని శివాలయాన్ని ఎక్కడైనా చూశారా? కానీ కేరళలో అలాంటి శివాలయం కనిపిస్తుంది. కేరళ చరిత్రలో సాంస్కృతిక రాజధానిగా విలసిల్లిన త్రిస్సూర్‌ (తిరుశివపెరూర్‌)లో ఉన్న వడక్కునాథన్ ఆలయాన్ని పరశురాముడు నిర్మించాడని చెబుతారు. పురాతన, చారిత్రక ప్రాశస్త్యమున్న ఈ ఆలయం అనేక కళలకు నిలయం. పురాతన ఆలయం అని చెబుతున్నారు కదా, మరి శివలింగం ఉండకపోవడమేమిటి? అనుకోకండి. ఇక్కడ శివలింగం ఉంది!

కానీ వందల సంవత్సరాలుగా ఈ శివలింగానికి నెయ్యితో అభిషేకాలు చేసీ చేసీ అది ఒక గుట్టలా పేరుకుపోయిందని అంటారు. దాదాపు అయిదారు మీటర్ల ఎత్తున్న నెయ్యిగుట్ట కింద శివలింగం కప్పబడిపోయిందట. ఆ నెయ్యి కాస్తా గడ్డకట్టుకుపోయింది. అది మండే ఎండల్లోనూ కరగదు, వాసననూ వెదజల్లదు. అదీ సంగతి! ఏడాదిలోపు పిల్లలను ఈ ఆలయంలోకి అనుమతించరు. లోపలికి ప్రవేశించాలంటే సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి. మహాశివరాత్రి పర్వదినాన లక్ష దీపాల అలంకరణతో తేజోవంతంగా భాసిల్లుతూ భక్తులకు కనువిందు చేయడం ఈ ఆలయ ప్రత్యేకత. ప్రపంచంలో శివలింగం కనిపించని ఏకైక శివాలయం ఇదొక్కటేనేమో!

No comments:

Post a Comment