Wednesday, 28 September 2016

white spots in nails what to do --- గోళ్ళపై వుండే తెల్లని మచ్చలు దేనిని సూచిస్తాయో తెలుసా…

మీ గోళ్ళపై తెల్లని మచ్చలు వున్నాయా ? దాని వల్ల మీకు లాభామా. నష్టమా అని తెలుసుకోవాలని వుందా? అయితే దీనిని మొత్తం చదవండి. గోళ్ళపై తెల్లని మచ్చలు వుంటే అది అనారోగ్యాలకు సూచికలంట. అంతే కాకుండా వీటిని పట్టించుకోకుండా అలా వదిలిస్తే చాలా ఎక్కువ అనర్దాలు జరుగుతాయట. ఇంతకీ దీని వల్ల కలిగే అనర్దాలేంటో ఒక సారి చూద్దాం.

1.గోళ్ళపై ఏర్పడే మచ్చలు మన నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తాయట.
2. మనం ఎంత ఒత్తిడి కి గురయ్యితే అంత ఎక్కువగా గోళ్ళ పై తెల్ల మచ్చలు వస్తాయంట.
3.మినరల్ లేదా విటమిన్ లోపాల వల్ల ఈ మచ్చలు వస్తాయి.
4.వీటి వల్ల త్వరగా ఇన్ఫెక్షన్ల పాలవుతామట.
5.ఇవి నెయిల్ పాలిష్ లు ఎక్కువగా వాడటం వల్ల కూడా వస్తాయట.
6. జింక్ ,ప్రోటిన్స్ లోపం వల్ల కూడా గోళ్ళపై తెల్లని మచ్చలు ఏర్పడతాయట.
7. అనిమీయా మరియు కిడ్నీ ఫెయిల్యూర్ వంటి వ్యాధులు వలన కూడా గోళ్ళపై మచ్చలు ఏర్పడతాయి.
సో ఇవి వచ్చినప్పుడు వీలైనంతవరకు డాక్టరును సంప్రదించడం చాలా మంచిది.

No comments:

Post a Comment