Saturday, 24 September 2016

every man can discours to the doctor -- ప్రతి పురుషుడు డాక్టరుతో కచ్చితంగా చర్చించాల్సిన విషయాలు..

సాధారణంగా మగవారు తమ ఆరోగ్య పరిస్థితులు గురించి వేరోకరి దగ్గర అస్సలు ప్రస్తావించరు. కొంతమందైతే కట్టుకున్న తన భార్య కూడా చెప్పారు. అది వేరే సంగతిలెండి. ఇక అవ్వన్ని పక్కన పెడితే ప్రతి మగాడు డాక్టరుతో కచ్చితంగా చర్చించాల్సిన విషయాలు కొన్ని వున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాన్.

1. సెక్స్ సమస్యలు.. వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వీటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డాక్టర్ కి చెప్పి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవాలి.
2. ఛాతిలో కలిగే నొప్పి. ఇది కొన్ని సార్లు గుండె పోటుకు సూచిక గా పరిగిణిస్తారు.అందుకే ఈ విషయం లో అస్సలు దాపరికం వుండకూడదు.
3. త్వరగా అలసిపోవడం, వయస్సు పెరుగుతూ వుంటే వ్యాయమం చేసినప్పుడు ఆయాసం పెరుగుతుంది. కాని ఈ ఆయాసం మరి ఎక్కువగా వుంటే డాక్టర్ కు ఎంత త్వరగా చెప్తే చాలా మంచిది. ఎందుకంటే చాలా జబ్బులకు ఆయాసం ఒక సూచిక.
4. వీలైనంత వరకు డాక్టర్ పర్యవేక్షణలోనే మందులు వాడాలి.

cold and fever controle this mixture was eat --- జ‌లుబు, జ్వ‌రం త‌గ్గాలంటే.. ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవాలి…

ఉసిరి కాయ‌ల్లో, తేనెలో ఎంత‌టి పోష‌కాలు ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ వంటి గుణాల‌తోపాటు శ‌రీర వ్యాధినిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేసే ఎన్నో గుణాలు ఈ రెండింటిలోనూ ఉన్నాయి. అయితే వీటిని క‌లిపి మిశ్ర‌మంగా తీసుకుంటే మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను సుల‌భంగా దూరం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ జ్యూస్‌లో ఒక టీస్పూన్ తేనెను క‌లిపి ప్రతి రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తీసుకోవాలి. దీంతో కింద చెప్పిన ప‌లు అనారోగ్యాలు దూర‌మ‌వుతాయి.

1. పైన చెప్పిన ఉసిరి జ్యూస్‌, తేనె మిశ్ర‌మం వ‌ల్ల ఊపిరితిత్తుల్లో ఉండే బాక్టీరియా పోతుంది.
2. జ‌లుబు, ద‌గ్గు, ఫ్లూ జ్వ‌రం త్వ‌ర‌గా త‌గ్గుతుంది. వ్యాధి నిరోధ‌క శ‌క్తి బాగా పెరుగుతుంది.
3. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. అసిడిటీ, గ్యాస్‌, అజీర్ణం వంటివి త‌గ్గిపోతాయి. మ‌లబ‌ద్ద‌కం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
4. సైన‌స్‌, ఆస్త‌మా వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.
5. దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. జుట్టుకు మేలు జ‌రుగుతుంది. వెంట్రుక‌లు దృఢంగా పెరుగుతాయి.
6. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. చ‌ర్మానికి మృదుత్వం చేకూరుతుంది.

stoping cigirate wait gain or not --- సిగరెట్ మానేసిన తర్వాత నిజంగా బరువు పెరుగుతారా ?

అవును కచ్చితంగా పెరుగుతారు అని బల్ల గుద్ది మరి చెప్తున్నారు ” బ్రిటీష్ మెడికల్ జనరల్ ” కు చెందిన పరిశోధకులు. సిగరెట్ మానేయడం కన్నా బరువు పెరగడమే మంచిదని తేల్చారు ఈ పరిశోధకులు. దీనికి కారణం కూడా చెప్పారు. అదేమిటంటే వారు సిగరెట్ తాగాలి అనుకున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఏదోక పుడ్ తింటున్నారని అందుకే సిగరెట్ మానేసిన మొదటి ముడు నెలలలో యావరేజ్ గా 2.9 కిలోల బరువు, సంవత్సరం లోపు 4.7 కీలోలు పెరుగుతున్నారని కనుకొన్నారు. ఇలా బరువు పెరిగిపోతున్న వారిని గమనించి వారి కోసం కొన్ని చిట్కాలు కనుగోన్నారు. అదేమిటంతే ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోకుండా కొన్ని ప్రత్యామ్నాయ లను సూచించాలు. అవేంటో ఒక సారి చూద్దాం.

1. చక్కెర లేని గమ్ లు,
2. చక్కెర లేని చాక్లెట్,
3. తృణ ధాన్యాలు,
4. చిలకడ దుంపలు
వీటి వల్ల సిగరెట్ మానేసిన వారు బరువు పెరగకుండా వుండవచ్చు.

which juice drink to sugar patient -- షుగర్ వున్న వారు ఎలాంటి జ్యూస్ లు తాగాలో తెలుసా ?

షుగర్, ఈ వ్యాధి పెట్టే నరకం అంతా ఇంతా కాదు. ఒక చోట కూడా సరిగ్గా నిలబడనివ్వదు. అందుకే వీరు ఏది తినాలన్నా ,అలోచించి మరి తింటారు.అలాంటి వీరు ఎలాంటి జ్యూస్ లు తాగాలో ఇప్పుడు చూదాం.

1.ద్రాక్ష రసం, ఫైనాఫిల్ జ్యూస్ లలో చక్కెర స్థాయిలు తక్కువగా వుంటాయి ఇది షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎంతో మంచిది.
2. సిట్రస్ జాతి పండ్లు షుగర్ వ్యాధి వున్న వారికి చాలా మంచిదని ‘ అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ‘ వారు తెలిసారు. దీంట్లో ఫైబర్స్ ఎక్కువగా వుంటాయి.
3.ఆపిల్ జ్యూస్, తక్కువ కార్బోహైడ్రేట్స్ లా వుండే నిమ్మ రసం కూడా షుగర్ వ్యాధి గ్రస్తులకు చాలా మంచిది
4. క్యారెట్ , టమోటా జ్యూస్ లలో కూడా చక్కెర స్థాయిలు తక్కువగా వుంటాయి. ఇవి షుగర్ వ్యాధి గ్రస్తులకు మంచి ఫలితాన్ని ఇస్తాయి.
5. జ్యూస్ లలో వీలైనంత వరకు షుగర్స్ వేసుకోకుండానే తాగాలి.
6. ఆపిల్, క్యారెట్ జ్యూస్ మధుమేహా వ్యాధి గ్రస్తులకు చాలా మంచిది. ముఖ్యంగా ఉపవాస సమయంలో వీటి ద్వారా అధిక కార్బోహైడ్రేట్స్ శరీరానికి అందుతాయి.
7. సోడియం తక్కువగా వున్న పండ్ల రసాలు కూడా చక్కెర వ్యాధిగ్రస్తులకు మంచిదే.

complete in meals in eat in figs fruits -- భోజ‌నానికి ముందు ఈ పండు తింటే, అనారోగ్యాలు హుష్ కాకి !

ఎండ‌బెట్టి డ్రై ఫ్రూట్స్ రూపంలోకి మార్చిన అంజీర్ పండ్లు మార్కెట్‌లో మ‌న‌కు ల‌భ్య‌మ‌వుతున్నాయి. వీటిని అంద‌రూ చూసే ఉంటారు. అయితే డ్రై ఫ్రూట్స్ రూపంలో దొరికే అంజీర్ పండ్లే కాదు, సాధార‌ణ పండు రూపంలోనూ అంజీర్‌ను తింటే దాంతో మ‌న‌కు ఎన్నో ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా ఈ పండును రెండు పూట‌లా భోజనానికి ముందు తింటే దాంతో అనేక అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అంజీర్ పండ్ల‌లో ఫైబ‌ర్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది మ‌నం తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ బాగా ప‌నిచేస్తుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బద్ద‌కం వంటి జీర్ణ సంబంధ స‌మ‌స్య‌ల‌న్నీ దూర‌మ‌వుతాయి.
2. అంజీర్‌లో పొటాషియం, సోడియం బాగా ల‌భిస్తాయి. ఇవి ర‌క్త‌పోటు (బీపీ) స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మనాన్ని క‌లిగిస్తాయి. బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి.
3. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నేడు చాలా మందిని బాధిస్తోంది. అలాంటి వారు నిత్యం రెండు అంజీర్ పండ్ల‌ను భోజనానికి ముందు తిన్న‌ట్ట‌యితే వారిలో ర‌క్తం బాగా ప‌డుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. మ‌లేరియా, టైఫాయిడ్‌, డెంగీ వంటి విష జ్వ‌రాల బారిన ప‌డి ప్లేట్‌లెట్లు త‌గ్గిన వారికి ఈ పండ్ల‌ను తినిపిస్తే వెంట‌నే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.
4. అధిక బ‌రువు స‌మ‌స్య కూడా ఇప్పుడు అధిక‌మైంది. ఈ క్ర‌మంలో అంజీర్ పండ్ల‌ను రెండు పూట‌లా భోజనానికి ముందు తింటే దాంతో పొట్ట నిండిన భావ‌న క‌లుగుతుంది. దీని వ‌ల్ల ఎక్కువ‌గా ఆహారం తీసుకోవ‌డం త‌గ్గుతుంది. ఫ‌లితంగా బ‌రువు కూడా త‌గ్గుతారు. అంతేకాదు అంజీర్‌లో ఉండే పోష‌కాలు మ‌న శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా త‌గ్గిస్తాయి.
5. నిత్యం అంజీర్ పండ్ల‌ను తింటుంటే గుండె సంబంధ స‌మ‌స్య‌లు కూడా దూర‌మ‌వుతాయి. అంజీర్ పండ్ల‌లో ఉండే పెక్టిన్ అనే ప‌దార్థం శ‌రీరంలోని వ్య‌ర్థ ప‌దార్థాల‌ను తొల‌గిస్తుంది. ర‌క్తాన్ని శుద్ధి చేస్తుంది.
6. అంజీర్ పండ్ల‌లో మెగ్నిషియం, మాంగ‌నీస్‌, జింక్ స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి సంతానం కావాల‌నుకునే వారికి మేలు చేస్తాయి.
7. శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. క్యాన్స‌ర్‌కు కార‌ణ‌మ‌య్యే ప‌దార్థాలు నాశన‌మ‌వుతాయి.
8. అంజీర్ పండ్లు మ‌ధుమేహం ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి. భోజనానికి ముందు వీటిని తింటే అనంత‌రం ర‌క్తంలో షుగ‌ర్ స్థాయిలు అంత‌గా పెర‌గ‌వు.
9. ఆస్త‌మా వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అంజీర్ పండ్ల‌ను తింటే ఆ అనారోగ్యాల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
10. అంజీర్ పండ్ల‌లో కాల్షియం కూడా పుష్క‌లంగానే ఉంటుంది. వీటిని తిన‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢ‌మ‌వుతాయి. ఎముక‌లు విరిగి ఉన్న వారికి వీటిని పెడితే ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి.
11. గొంతు నొప్పి ఉన్న‌వారు అంజీర్ పండ్ల‌ను తింటే వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ద‌గ్గు కూడా త‌గ్గుతుంది.
12. జ్వ‌రం, చెవి నొప్పి, క‌డుపు నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఉంటే అంజీర్ పండ్ల‌ను తినాలి. దీంతో ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Friday, 23 September 2016

daily drink soda what happen -- రోజు సోడా తాగడం వల్ల కలిగే అనర్దాలేంటో తెలుసా ?

సోడా , ప్రస్తుతం వున్న ఆధునికరణ జీవితంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న పానీయం. దీనికి యువకులే కాదు పెద్ద వారు దాసొహాం అవుతున్నారు. ఎంతగా ఏ పార్టీ కి వెళ్ళినా , భోజనం చేస్తున్నా దాహాంగా దీనిని అధిక ప్రయారీటీని ఇస్తున్నారు. కాని దీని వల్ల ఎన్నో అనర్దాలు వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1. సోడాలో సిట్రిక్ ఆసిడ్, అధిక మొత్తంలో చక్కెరలు వుంటాయి. దీని వల్ల దంతాల పై వున్న ఎనామిల్ అనే పోర ప్రమాదానికి గురవుతుంది. అలాగే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాక్షయం బారిన పడే అవకాశం వుందని ” జెజియాంగ్ విశ్వవిద్యాలయం సైన్స్ ” వారు వారి పరిశోధనలలో కనుగొన్నారు.
2. కార్బోనేటేడ్ సోడాను ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయి.
3. ” అమెరికన్ జర్నల్స్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషియన్ ” వారు చేసిన పరిశోధనలలో సోడా వల్ల గుండె పోటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువ అని తేలింది.
4. సోడాలోని కృత్రిమ చక్కెర సమ్మేళనాలు శరీర బరువును పెంచడమే కాకుండా ఉబకాయం వచ్చే అవకాశాలను అధికంగా చేస్తుంది.
5. మధుమేహాం ముప్పు సోడా తాగడడం వల్ల అధికంగా వుంటుంది.

Dont leae in so many uses in Curd - ఈ ఉప‌యోగాలు తెలిస్తే పెరుగును వదిలిపెట్ట‌రు..!

చ‌క్క‌ని రుచి క‌లిగి ఉండే గ‌డ్డ పెరుగు అంటే చాలా మందికి ఇష్ట‌మే. కొంద‌రు భోజ‌నం చివ‌ర్లో పెరుగుతో తినంది అసలు తృప్తి చెంద‌రు. భోజనం అయిపోన‌ట్టుగానే భావిస్తారు. కానీ కొంత‌మందికి పెరుగు కాదు క‌దా, పాలు దాని సంబంధ ప‌దార్థాలు అస్స‌లు న‌చ్చ‌వు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఉప‌యోగాల గురించి తెలిస్తే పెరుగంటే ఇష్టం లేని వారు కూడా దాన్ని వాడేందుకు ఆస‌క్తి చూపుతారు. ఎందుకంటే దాంతో అన్ని ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి మ‌రి. ఆ ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కొద్దిగా జీల‌క‌ర్ర‌ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.
2. కొద్దిగా న‌ల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ క‌ప్పు పెరుగులో క‌లుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. ప్ర‌ధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి.
3. కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినాలి. దీంతో శ‌రీరానికి వెంట‌నే శ‌క్తి అందుతుంది. మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి.
4. కొంత వాము తీసుకుని ఓ క‌ప్పు పెరుగులో క‌లిపి తినాలి. దీని వ‌ల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇత‌ర దంత సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.
5. ఓ క‌ప్పు పెరుగులో కొంత న‌ల్ల మిరియాల పొడిని క‌లిపి తినాలి. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం దూర‌మ‌వుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.
6. పెరుగులో కొన్ని ఓట్స్ క‌లిపి తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ప్రోబ‌యోటిక్స్‌, ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి కండ‌రాల పుష్టికి దోహ‌దం చేస్తాయి.
7. పెరుగులో వివిధ ర‌కాల పండ్ల‌ను క‌లిపి తింటే శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.
8. పెరుగులో కొంత ప‌సుపు, కొంత అల్లం క‌లిపి తినాలి. దీని వ‌ల్ల ఫోలిక్ యాసిడ్ శ‌ర‌రీంలోకి చేరుతుంది. ఇది చిన్నారుల‌కు, గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది.
9. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ క‌లిపి తింటే శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ సి ల‌భిస్తుంది. ఇది కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయ‌ల‌ను దూరం చేస్తుంది.
10. పెరుగులో తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో ఉన్న అల్స‌ర్లు మటుమాయ‌మైపోతాయి. ఈ మిశ్ర‌మం యాంటీ బయోటిక్‌గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష‌న్లు వెంట‌నే త‌గ్గుతాయి.